ఆసియా ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ టోర్నీలో భారత క్లబ్ ఈస్ట్ బెంగాల్‌కు నిరాశ ఎదురైంది. సొంత మైదానంలో ఇరాక్‌కు చెందిన అల్ షోర్టా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ 23 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. తొలి అర్ధభాగంలో ఆధిక్యం సాధించినప్పటికీ, రెండో అర్ధభాగంలో ప్రత్యర్థి గోల్స్‌తో విజయం దూరమైంది.
కోల్‌కతాలోని వివేకానంద యువభారతి క్రీడాంగణంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్‌కు ఊహించని ఫలితం ఎదురైంది. మ్యాచ్ ప్రారంభమైన ఎనిమిదో నిమిషంలో డేవిడ్ లాల్హ్లాన్సంగా గోల్ చేసి ఈస్ట్ బెంగాల్‌కు శుభారంభం అందించాడు. అయితే, 14వ నిమిషంలో అహ్మద్ యాహ్యా గోల్ చేయడంతో అల్ షోర్టా స్కోరును 11తో సమం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తొలి అర్ధభాగం ముగియడానికి ఐదు నిమిషాల ముందు, అంటే 40వ నిమిషంలో, లాల్హ్లాన్సంగా మరోసారి గోల్ సాధించడంతో ఈస్ట్ బెంగాల్ 21 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది. ఈ దశలో ఈస్ట్ బెంగాల్‌కు విజయంపై ఆశలు చిగురించాయి.











