ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో జట్టు విజయానికి కీలకంగా నిలిచిన బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీ.. ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీల్లోనూ ఒత్తిడికి వెనుకాడబోనని స్పష్టం చేశాడు.
దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన బ్రీట్జ్కీ దూకుడైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతను 112 పరుగులు చేసి రెండో వన్డే శతకాన్ని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బ్రీట్జ్కీ, మార్కో జాన్సెన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జాన్సెన్ 59 బంతుల్లో 75 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 300 పరుగులకు చేరువైంది.











