మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు అనుభవంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితాన్ని తాను అనుభవించలేదని, ఎంజాయ్ చేశానని, అది తనకు స్ఫూర్తిని నింపిన శిక్షణా కేంద్రమని ఆయన పేర్కొన్నారు.
జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, రాజమండ్రి సెంట్రల్ జైలు తనకు ఒక పాఠశాల లాంటిదని, అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తన రాజకీయ జీవితంలో జైలు అనుభవం ఒక మలుపు అని, అది తనను మరింత బలోపేతం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.










