అనంతపురంలోని వైయస్ఆర్ జిల్లా కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఐదేళ్ల పాలనలోని సంక్షేమం, అభివృద్ధికి, ప్రస్తుత రెండేళ్ల అక్రమాలు, అరాచకాలకు మధ్య చర్చకు సిద్ధమని ప్రకటించారు.
వైయస్ఆర్ అనంతపురం అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు తిప్పేస్వామి, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి నాయకులు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ల సహకారంతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అతడి అనుచరులు దోపిడీ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎమ్మెల్యే, అనుచరుల అరాచకాల గురించి చెబుతున్నారని తెలిపారు. వైయస్ఆర్ హయాంలో రెండేళ్లు కోవిడ్ పరిస్థితులు ఉన్నా ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని, అభివృద్ధి పనులు చేశామని గుర్తుచేశారు. అనంతపురం నగరంలో రూ.1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.











