అరెస్ట్ చేసే సమయంలో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నిందితుడికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా తెలియజేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం, తన అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి వ్యక్తికీ ఉందని పేర్కొంది.
అరెస్ట్ చేసే సమయంలో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నిందితుడికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా తెలియజేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం, తన అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి వ్యక్తికీ ఉందని పేర్కొంది. ఈ నిబంధనలను పాటించకుండా చేసిన అరెస్టును చట్టవిరుద్ధమైనదిగా పరిగణించి, సంబంధిత వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










