రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా రాయచోటిలోని ఎస్.ఎన్. కాలనీలో గల టీడీపీ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను ఎన్నికల సైనికుడిగా భావించి వార్డుల వారీగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.











