హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణ ఈశ్వరయ్యను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ శనివారం పరామర్శించారు. ఉన్నపలంగా అనారోగ్యానికి గురైన ఈశ్వరయ్యను ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
రెండు రోజుల క్రితం ఈశ్వరయ్య గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని సీపీఐ శ్రేణులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న జూపూడి ప్రభాకర్ శనివారం ఆస్పత్రికి వెళ్లి ఈశ్వరయ్యను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.










