సామాజిక సేవకుడు గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
టెక్నో స్కూల్, హోమియో ద్వారా ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న గుజ్జ సత్యంకు ఈసారి బీసీల తరపున ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చింతల శంకర్ విజ్ఞప్తి చేశారు. బీసీల సంక్షేమం కోసం ఆయన జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారని, ప్రతినిత్యం బీసీల మంచి కోరే వ్యక్తి అని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రజల మనిషిగా పేరుగాంచిన గుజ్జ సత్యంను శాసన మండలికి పంపిస్తే బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఆలోచించి, గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ నాయకులు బట్టు వెంకట రాములు, వెంకన్న, రాజేందర్, దినేష్, సంగాగౌడ్, పెంటయ్య, లింగమయ్య, సురేందర్, మహమ్మద్ ఖాసీం, భూపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










