దేశవ్యాప్తంగా ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల అమలు కోసం సామాజిక కార్యకర్త ప్రవీణ్ అరోరా చేపట్టిన రథయాత్ర ఈ నెల 24న కామారెడ్డికి చేరుకోనుంది. ఈ సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పేదలు, బలహీన వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు జూకంటి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ యాత్ర దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో సుమారు 20 వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది. రిజర్వేషన్ల ప్రయోజనాలు అర్హులైన పేదలకు అందేలా ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల అమలుపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
రాత్రి తెలంగాణలోకి ప్రవేశించే ఈ యాత్ర జిల్లా నుంచి నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్ మీదుగా కామారెడ్డికి చేరుకోనుంది. కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రవీణ్ అరోరా పాల్గొంటారు.











