తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. స్థానిక వార్డు కౌన్సిలర్ ఖాలేఖ్, కాంగ్రెస్ మైనారిటీ సెక్రెటరీ యండి. దావూద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డులోని వడ్రంగి సంఘం భవనంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మార్వో రాజా నరేందర్ గౌడ్ తో కలిసి కౌన్సిలర్ ఖాలేఖ్, యండి. దావూద్ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు ఖమర్ సుల్తానా గౌస్, జీపిఓలు హర్ష, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










