దేశవ్యాప్తంగా నుంచి 30 వరకు జరగాల్సిన మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా పడింది. భారతీయ బ్యాంకుల సంఘం, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చల్లో అవగాహన కుదరడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యూనియన్ వర్గాలు ప్రకటించాయి. దీంతో ఖాతాదారులకు సేవల అంతరాయం తప్పింది.
బ్యాంకు ఉద్యోగ సంఘాలు అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని చాలాకాలంగా కోరుతున్నాయి. ఈ అంశంపై భారతీయ బ్యాంకుల సంఘం, యూనియన్ ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించి, సంబంధిత వర్గాలతో చర్చించి పరిష్కార మార్గాన్ని సూచించనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉన్నతాధికారుల ప్రోత్సాహక పథకంపై చర్చలు
స్కేల్-4, అంతకంటే పైస్థాయి అధికారులకు సంబంధించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకంపై కూడా చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే 2018న జరిగిన సమావేశానికి సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా పరిష్కరించేందుకు చర్చలు జరగనున్నాయి.











