దొరల పాలన, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని సీఎం స్మరించుకున్నారు.
దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ యోధురాలికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సామాజిక వివక్ష, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదని, అణగారిన ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, ఆమె ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు.











