రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు మత్తు పదార్ధాల సరఫరాకు నిలయాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన డ్రగ్స్ ముప్పు, నేడు కడప, రాజంపేట వంటి పట్టణాలతో పాటు పల్లె సీమలనూ కబళిస్తోంది. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ రూపంలో యువత చిమ్మచీకట్లోకి జారిపోతోంది.
తీవ్ర మానసిక ఒత్తిడి, చెడు స్నేహాలు, సోషల్ మీడియా వ్యామోహం యువతను ఈ ఊబిలోకి నెడుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించేందుకు డ్రగ్ పెడ్లర్లు కొత్త దారులు వెతుకుతున్నారు. చాక్లెట్లు, సిగరెట్లు, తీపి పదార్థాల రూపంలో మత్తును ఎరగా వేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వేదికలుగా రహస్య కోడ్ భాషలో వ్యాపారం సాగిస్తూ విద్యాకుసుమాలను బలితీసుకుంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నివారణ చర్యలు












