భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు న ప్రకటించారు. అయితే ఆటగాడిగా భారత జట్టుకు కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు.
కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అంత సులభమైన నిర్ణయం కాదని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, కీలక సందర్భాలు ఈ ప్రయాణంలో భాగమయ్యాయని తెలిపారు. జట్టుకు తనవంతు బాధ్యతను నిర్వర్తించానని, ఇకపై ఆటపై ఉన్న ప్రేమతోనే మళ్లీ ఆడాలని భావిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత మహిళల జట్టు 2025లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇటీవల 2026 ఆసియా క్రీడల్లోనూ భారత్ మహిళల జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. ఆమె ఐదు టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ క్రికెట్లో 150కి పైగా టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి ఆటగాడిగా ఆమె రికార్డు సృష్టించారు.











