నెల్లూరు జిల్లా మండలం బీసీ కాలనీ సమీపంలోని కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. మూడు నాగుపాములు ఆలయంలోకి ప్రవేశించి, నేరుగా శివలింగం వద్దకు చేరుకున్నాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ ఆలయంలో అరుదైన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. మండలం బీసీ కాలనీ సమీపంలోని కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున మూడు నాగుపాములు కనిపించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయంలోకి వచ్చిన మూడు నాగుపాములు నేరుగా శివలింగం వద్దకు చేరుకున్నాయి. కొద్దిసేపు శివలింగం చుట్టూ తిరుగుతూ కనిపించాయి. అనంతరం మూడు పాములు శివలింగం ముందు పక్కపక్కనే పడగలు విప్పి నిలబడటంతో, అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలను పలువురు భక్తులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.











