నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నీట్ పీజీ 2026 ఫలితాలను విడుదల చేసింది. ఈసారి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థి 720 మార్కులకు గాను 641 మార్కులు సాధించారు. టాప్-20 ర్యాంకుల్లో ఉన్న అభ్యర్థుల మార్కులు 614 నుంచి 641 మధ్య ఉన్నాయి.
ర్యాంక్ 1 సాధించిన అభ్యర్థి 641 మార్కులు పొందగా, ర్యాంక్ 2లో ఉన్న అభ్యర్థికి 633 మార్కులు వచ్చాయి. మూడో ర్యాంక్ అభ్యర్థి 626 మార్కులు సాధించారు. 625 మార్కులతో పలువురు అభ్యర్థులు నాలుగో ర్యాంక్‌లో ఉన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కటాఫ్ మార్కులు
నీట్ పీజీ 2026లో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50వ పర్సంటైల్ (262 మార్కులు) కనీస అర్హతగా నిర్ణయించారు. జనరల్ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 45వ పర్సంటైల్ (244 మార్కులు) కటాఫ్‌గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలాగే ఆయా కేటగిరీల పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40వ పర్సంటైల్ (226 మార్కులు) కనీస అర్హతగా నిర్ణయించారు.











