ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల వద్ద వినియోగంలో లేని భూములు, భవనాల నుంచి ఆదాయం సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.5,000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణ ప్రతిపాదనలను బోర్డు సిఫార్సు చేసింది.
ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో పారదర్శకత, సమర్థత, సరైన విలువను సాధించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బోర్డు సూచించింది. గుర్తించిన ఆస్తులను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచకుండా, సంబంధిత ప్రభుత్వ సంస్థలతో సమన్వయం పెంచి త్వరగా తదుపరి దశలకు తీసుకెళ్లాలని పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మిగులు భూములు, భవనాలను ఉత్పాదక వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రస్తుతం ఉపయోగంలో లేని ప్రభుత్వ ఆస్తుల నుంచి విలువను వెలికితీయడం ఎన్ఎల్ఎంసీ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందుకోసం ఆస్తుల పరిశీలన, విలువ నిర్ధారణ, తగిన నగదీకరణ విధానాల రూపకల్పన వంటి ప్రక్రియల్లో సంబంధిత సంస్థలకు సహకరిస్తోంది.











