అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తూ ప్రసారమైన వివాదాస్పద టెలివిజన్ ప్రకటనలకు ఇకపై ప్రభుత్వ నిధులు వినియోగించబోమని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనల ఖర్చును తనకు అనుకూలమైన రాజకీయ సూపర్ పీఏసీ . లేదా తానే భరిస్తానని తెలిపారు.
ఇటీవల అమెరికా టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన మూడు ప్రకటనలు తీవ్ర వివాదానికి దారితీశాయి. వాటిలో ట్రంప్ ప్రభుత్వ విజయాలను ప్రస్తావించడంతో పాటు అమెరికా భద్రత, పన్నుల తగ్గింపు, తయారీ రంగం, చట్టబద్ధత వంటి అంశాలను ప్రస్తావించారు. ఒక ప్రకటనలో ట్రంప్ ప్రసంగానికి సంబంధించిన దృశ్యాలు, మరో ప్రకటనలో మౌంట్ రష్మోర్ దృశ్యాలు ఉపయోగించారు. మూడో ప్రకటన 2024లో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటనను పోలి ఉందని విమర్శలు వచ్చాయి. ఈ ప్రకటనల చివరలో .. అని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రకటనల వ్యయం, వివాదం
ఈ ప్రకటనల కోసం కనీసం 15 లక్షల డాలర్లకు పైగా ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయని నివేదికలు పేర్కొన్నాయి. అయితే మొత్తం వ్యయం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రకటనల ఖర్చులను పర్యవేక్షించే సంస్థలు తెలిపాయి. ప్రకటనలు ప్రభుత్వ ప్రజాసేవా సందేశాలేనని వైట్‌హౌస్ సమర్థించగా, విమర్శకులు మాత్రం అవి ప్రభుత్వ సమాచార ప్రచారానికి మించి రాజకీయ ప్రచారాన్ని పోలి ఉన్నాయని ఆరోపించారు.










