ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరోసారి తీవ్రమైన మచ్చగా మిగిలిపోయింది. రాజంపేటతో పాటు రాష్ట్రవ్యాప్తంగా డజనుకు పైగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఏకగ్రీవం కావడం పైకి అధికార పక్షానికి తిరుగులేని విజయంగా కనిపించినా, దాని వెనుక బెదిరింపు ధోరణులు, నామినేషన్ల లాగేసుకునే దుశ్చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే కదిలిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం గెలుపు ఓటముల లెక్కలు కాదని, అది ప్రజల అభీష్టానికి అద్దం పట్టే పవిత్ర ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. కానీ ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు భయానక వాతావరణానికి ప్రతీకగా మారుతున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్ల అడ్డుగింత, దౌర్జన్యం
రాజంపేటతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా ప్రత్యర్థులు భయభ్రాంతులకు గురిచేశారు. నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కోవడం, అధికారులపై ఒత్తిడి తెచ్చి అభ్యర్థుల పత్రాలను వివిధ సాకులతో తిరస్కరింపజేయడం వంటి ఘటనలు సోషల్ మీడియాలోనూ, బహిరంగంగానూ చర్చనీయాంశమయ్యాయి.











