ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై రాజకీయ వివాదం తీవ్రమైంది. వైఎస్సార్ జిల్లా లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. గత వారం రోజులుగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. నామినేషన్ల పరిశీలన సమయంలో తమ పార్టీ ప్రతినిధులను అనుమతించకపోవడంపై ప్రశ్నించగా, వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులకు గాయాలైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మున్సిపల్ చైర్మన్, జడ్పీటీసీ అభ్యర్థులపై దాడులు
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డిపై దాడి జరిగిందని, మహిళా అభ్యర్థులతోనూ దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. మండల జడ్పీటీసీ అభ్యర్థి ఓబయ్య యాదవ్ నామినేషన్ వేసి తిరిగి వస్తుండగా, టీడీపీ అభ్యర్థి బచ్చల ప్రతాప్ తనపై, తన ప్రతిపాదకుడిపై దాడి చేశారని ఆరోపించినట్లు రాచమల్లు తెలిపారు. ప్రతిపాదకుడిని కిడ్నాప్ చేశారని పేర్కొంటూ ఓబయ్య చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.











