గాజాలో కొనసాగుతున్న యుద్ధం అత్యంత కీలక దశకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. హమాస్ నేత యహ్యా సిన్వర్ మరణం నేపథ్యంలో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకూ ఐరాస పిలుపునిచ్చింది. ఉత్తర గాజాలో పరిస్థితులు దారుణంగా మారాయని, ఆహార, నీటి సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది.
గాజాలో కొనసాగుతున్న యుద్ధం అత్యంత కీలక దశకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. హమాస్ నేత యహ్యా సిన్వర్ మరణం నేపథ్యంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలందరినీ ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి తరఫున ప్రతినిధి ఫర్హాన్ హక్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గాజా ఉత్తర ప్రాంతంలో పరిస్థితులు రోజురోజుకూ మరింత దారుణంగా మారుతున్నాయని ఐరాస మానవతా వ్యవహారాల కార్యాలయం తెలిపింది. భారీ దాడుల మధ్య కుటుంబాలు ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వెల్లడించింది. జబాలియా శరణార్థి శిబిరానికి సహాయం అందించడంలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొంది. అక్కడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యవసర అనుమతులు కోరినట్లు తెలిపింది.











