బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తన సినీ కెరీర్లో తొలిసారి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్న అనంతరం ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణపతి ఆలయాన్ని సందర్శించారు. తనకు లభించిన జాతీయ అవార్డు ట్రోఫీని గణపతి బప్పా పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
కార్తిక్ ఆర్యన్ చందూ ఛాంపియన్ చిత్రంలో భారత తొలి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రను పోషించినందుకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అవార్డు అందుకున్న మరుసటి రోజే కార్తిక్ సంప్రదాయ దుస్తుల్లో లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. చేతిలో జాతీయ అవార్డు ట్రోఫీతో గణపతి బప్పా ముందు ప్రార్థనలు చేసి, ఆ పురస్కారాన్ని స్వామివారి పాదాల చెంత సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో నా సుఖకర్త, దుఃఖహర్త.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ధన్యవాదాలు బప్పా అంటూ తన భావాలను పంచుకున్నారు.











