పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలానికి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు జంపల్లి సత్యవతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
జనసేన పార్టీకి చెందిన వీరంపాలెం, పట్టింపాలెం ఎంపీటీసీ జంపల్లి సత్యవతి, వైసీపీ ఇంచార్జి వడ్డి రఘురామ్ ఆధ్వర్యంలో అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన సత్యవతి, పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసం, వడ్డి రఘురామ్ నాయకత్వంపై నమ్మకంతో తిరిగి వైసీపీలో చేరినట్లు తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.









