నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనతో సంఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ శ్రీధర్ అనుచరులు అడ్డుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీనితో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి, అది ఘర్షణకు దారితీసింది.
పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీధర్ మరియు అతని మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.










