మదనపల్లె, జూన్ 28
జనసేన పార్టీలో వివిధ స్థాయి పదవుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సోమవారం (జూన్ 29) నుంచి ప్రారంభం కానుంది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఈ ప్రక్రియ జూలై 3 వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనసేన పార్టీ అధికారిక పేజీలో పీడీఎఫ్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలతో హాజరుకావాలని పార్టీ సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల చైర్మన్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ కళ్యాణం శ్రీనివాస్ సూచనలతో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పార్టీ కమిటీలకు వివిధ స్థాయి పదవుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సోమవారం (జూన్ 29) నుంచి జూలై 3 వరకు రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర తెలిపారు.
గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పార్టీ పదవులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనసేన పార్టీ అధికారిక పేజీలో విడుదల చేసే పీడీఎఫ్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆయన కోరారు.
బయోడేటా, ఇప్పటివరకు పార్టీ కోసం చేసిన కార్యక్రమాల వివరాలు, అలాగే జనసేన క్రియాశీలక సభ్యత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.











