కడప, 11 September
కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవితో పాటు 15 డివిజన్లలో అభ్యర్థులను నిలబెడుతున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ ప్రకటించారు. ప్రజా సమస్యలనే ప్రధాన అజెండాగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ సహా 15 డివిజన్లలో సిపిఐ పోటీ.. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవితో పాటు 15 డివిజన్లలో అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ ప్రకటించారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో వేముల ఓబులేసు అధ్యక్షతన జరిగిన నగర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పేదలకు ఇళ్ల స్థలాలు, పింఛన్ల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఐ, ప్రజా సమస్యలనే ప్రధాన అజెండాగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 27 నుండి 30 వరకు కడపలో జరగనున్న సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. న నిర్వహించే భారీ ర్యాలీ, బహిరంగ సభ ద్వారా “బద్లావ్ జెరూరి హై” (మార్పు అవసరం) నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్మికుల సమస్యలపై ప్లీనరీలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా, నగర కార్యవర్గ నాయకులు పాల్గొన్నారు.











