కామారెడ్డి, 10 September
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహిత ప్రాణాలను పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. గురువారం సాయంత్రం రైల్వే స్టేషన్‌కు వెళ్లిన మహిళను గుర్తించి, ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసుల తీరును అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సకాలంలో స్పందించిన పోలీసులు.. వివాహిత ప్రాణాలు కాపాడారు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన సంధ్యారాణి అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునేందుకు గురువారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు డయల్–100కు సమాచారం అందింది. వెంటనే టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ బి. నరహరి ఆదేశాల మేరకు అన్ని బ్లూ కోల్ట్స్ బృందాలను అప్రమత్తం చేశారు. పోలీసులు వేగంగా గాలింపు చేపట్టి రైల్వే ట్రాక్‌పై ఉన్న సంధ్యారాణిని గుర్తించి సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువచ్చారు. అనంతరం ఆమెను టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. కుటుంబ సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని పోలీసులు సూచించారు. సకాలంలో స్పందించి ఒక మహిళ ప్రాణాలను కాపాడిన పోలీసుల చర్యను స్థానికులు అభినందించారు.












