వైఎస్సార్ జిల్లా, కడపలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. పోలింగ్ కేంద్రాల్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించాలని అవినాష్‌రెడ్డి కోరగా, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
జిల్లాలోకి బయటి వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి రాళ్లు, కర్రలతో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, మరోవైపు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మండలం ఇప్పట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీదేవి, స్వతంత్ర అభ్యర్థి సురేఖపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో సాక్షి విలేకరి పుల్లారెడ్డిపై కూడా దాడి జరగడంతో ఆయన గాయపడ్డారు. కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లోనూ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారని, వారి పత్రాలను చించివేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










