లింగంపేట్ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 04
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపల్లి కుర్ద్ గ్రామ సమీపంలో కూలిపోయిన బ్రిడ్జి నిర్మాణం ఏడాది గడుస్తున్నా చేపట్టకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్కు పిండ ప్రదానం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఏడాది గడిచినా బ్రిడ్జి నిర్మాణం చేపట్టరా? ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు పిండ ప్రదానం.. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో , సెప్టెంబర్ 4: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండలం లింగంపల్లి కుర్ద్ గ్రామ సమీపంలో కూలిపోయిన బ్రిడ్జి నిర్మాణం ఏడాది గడుస్తున్నా చేపట్టకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్కు పిండ ప్రదానం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కూలిపోయిన బ్రిడ్జిని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ.. బ్రిడ్జి కూలిపోయి సంవత్సరం గడిచినా ఇప్పటివరకు పునర్నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాంతంలో అధికారిక పర్యటన నిర్వహించి, సమీక్ష సమావేశం నిర్వహించినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్షాకాలంలో రాకపోకలకు మరింత ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆందోళనకారులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జాజాల సురేందర్ హెచ్చరించారు.











