మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈగల్ ఫోర్స్ సాధించిన జాతీయ స్థాయి గుర్తింపు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రభుత్వ చర్యలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ () 3వ జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిల్య అత్యుత్తమ అవార్డును అందుకోవడం రాష్ట్ర పోలీసు శాఖకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ అనుసరిస్తున్న సమర్థవంతమైన విధానాలకు ఈ జాతీయ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడం కేవలం పోలీసు వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం ప్రతి కుటుంబం, ప్రతి పాఠశాల, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడి సమిష్టి బాధ్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.











