తంబళ్లపల్లి (డాక్సిన్ టైమ్స్) జూన్ 29
మల్లయ్య కొండను కాపాడే బాధ్యత తమదేనని, ఇక్కడ ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఉండదని, ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ కొండను పరిరక్షిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఇటీవల మైనింగ్ అంశంపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో, సోమవారం సాయంత్రం మల్లయ్య కొండను సందర్శించిన అనంతరం నాయకులు ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు.
తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మల్లయ్య కొండను కాపాడే బాధ్యత తమదేనని, ఇక్కడ ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఉండదని, ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ కొండను పరిరక్షిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్పష్టం చేశారు. ఇటీవల మైనింగ్ అంశంపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో, సోమవారం సాయంత్రం మల్లయ్య కొండను సందర్శించిన అనంతరం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, ఇతర నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్పష్టమైన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
2011లో కాంగ్రెస్ ప్రభుత్వం, 2024 జనవరిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో మైనింగ్‌కు సంబంధించి టెండర్లు పిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మల్లయ్య కొండలో ఎలాంటి మైనింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడమే తమ బాధ్యత అని నాయకులు స్పష్టం చేశారు.











