బాలీవుడ్ చిత్రం స్పెషల్ 26 తరహాలో ముంబైలో ఒక వ్యాపారి కార్యాలయంలో నకిలీ ఆదాయపు పన్ను శాఖ దాడి జరిగింది. తాము అధికారులమని నమ్మించి, వ్యాపారిని, అతని భార్యను బెదిరించి రూ.1 కోటి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.
ముంబైలోని సాకీనాకాకు చెందిన కంటి వైద్య పరికరాల వ్యాపారి రాజ్ కుమార్ కండసామి (49) కార్యాలయంలోకి కొందరు వ్యక్తులు చొరబడి, తాము ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పుకున్నారు. ఉద్యోగి ద్వారా సమాచారం అందుకున్న వ్యాపారి కార్యాలయానికి చేరుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నకిలీ అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించి, అక్కడ పనిచేస్తున్న 11 మంది ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాలను ఆపివేసి, వ్యాపారికి ఫోన్ చేసి వెంటనే కార్యాలయానికి రావాలని, లేదంటే అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో ఆయన తన భార్యతో కలిసి కార్యాలయానికి బయలుదేరారు.











