ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా మండలం నల్లకాల్వ గ్రామంలో సాక్షి విలేఖరి ఇంటిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. సాక్షి దినపత్రిక విలేఖరి ఎన్వీ సుబ్బారెడ్డి ఇంట్లోకి చొరబడిన టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించారు.
వివరాల్లోకి వెళితే.. ప్రాంతానికి చెందిన సాక్షి విలేఖరి ఎన్వీ సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు ముందు రోజు పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు తనను బెదిరించారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజకీయ ప్రోద్బలం ఆరోపణ
తనపై జరిగిన దాడి వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని బాధితుడు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడికి పాల్పడ్డారని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.











