జిల్లా నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ()లో విద్యార్థులకు కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఐఈఈఈ కమ్యూనికేషన్స్ సొసైటీ () స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్‌ను ప్రారంభించారు. న కళాశాలలోని ఈఎల్ఎన్ సెమినార్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, ఐఈఈఈ ప్రతినిధులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ టెక్నాలజీలు, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటెలిజెంట్ హార్డ్‌వేర్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడమే చాప్టర్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీని ద్వారా విద్యార్థులకు పరిశోధన, సాంకేతిక అభ్యాసం, ఆవిష్కరణలు, పరిశ్రమ నిపుణులతో పరిచయాలు, వృత్తిపరమైన నెట్వర్కింగ్ వంటి అవకాశాలు లభించనున్నాయి. ఐఈఈఈ కామ్సాక్ అధికారిక జాబితాలోనూ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ నమోదై ఉంది.











