నంద్యాల, 26 మే 2026
నంద్యాల జిల్లా నూనెపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరాహార దీక్ష చేపట్టారు. అండర్ బ్రిడ్జి లేకపోవడంతో రైల్వే మార్గాన్ని దాటేందుకు ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గతంలో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్‌కు ప్రత్యామ్నాయంగా రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మించినా, దాని వద్దకు అనధికారికంగా ప్రవేశిస్తున్నారని అధికారులు గుర్తించారు. ప్రజల భద్రత, రైల్వే కార్యకలాపాల భద్రత దృష్ట్యా రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనను పరిశీలించారు. 2026లో రైల్వే, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసినట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు.











