తెలంగాణకు చెందిన బీజేపీ నేత, న్యాయవాది నూనె బాల్ రాజ్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. గురుగ్రామ్‌లోని కేఆర్ మంగళం యూనివర్సిటీ ఆయన పరిశోధనను ఆమోదించి, న్యాయశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను ప్రకటించింది. దీంతో ఆయనను డాక్టర్ ఎన్. బాల్ రాజ్‌గా గుర్తించారు.
యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్ పరిధిలో బాల్ రాజ్ తన పరిశోధన పూర్తి చేశారు. భారతదేశంలో శాసనసభా ప్రత్యేక హక్కులు న్యాయవ్యవస్థ స్పందన ఒక విమర్శనాత్మక అధ్యయనం అనే అంశంపై ఆయన పరిశోధన సాగింది. శాసనసభా ప్రత్యేక హక్కులకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలు, వాటి చారిత్రక పరిణామం, పరిధి, న్యాయవ్యవస్థ స్పందన, ప్రస్తుత సవాళ్లను ఇందులో విశ్లేషించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అలాగే యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో అమలవుతున్న శాసనసభా ప్రత్యేక హక్కుల విధానాలను కూడా పరిశీలించారు. డాక్టరల్ వైవా వోస్ ప్రక్రియ అనంతరం ఆయన డాక్టరల్ డిఫెన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు. పరిశోధనకు డాక్టర్ ఆర్తి శర్మ సూపర్వైజర్గా, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు కో-సూపర్వైజర్గా వ్యవహరించారు.











