పదవీ కాలం ముగిసినప్పటికీ ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు, పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సూచించారు. బుధవారం మండలం చండ్రాజుపాలెం గ్రామంలో పదవీ కాలం ముగిసిన ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కూడా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై గత ఐదేళ్లుగా ప్రజా సేవలో ఉంటూ నేడు పదవీ విరమణ చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పదవీ కాలం ముగిసినప్పటికీ రానున్న ఎన్నికల్లో చురుకుగా పాల్గొని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు అండగా నిలవాలని సూచించారు. వెన్నుపోటు పార్టీ నేతలకు వెన్నులో వణుకు పుట్టేలా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.











