వాహనాలపై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చలాన్లను కేవలం జారీ చేయడమే కాకుండా, వాటి బకాయిలను సమర్థంగా వసూలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. బకాయిలు చెల్లించని వాహనాలకు పలు రవాణా సేవలను నిలిపివేయాలని సూచించింది.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పెండింగ్ చలాన్లు పూర్తిగా చెల్లించే వరకు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణ, డూప్లికేట్ ఆర్సీ జారీ, యజమాని చిరునామా మార్పు వంటి సేవలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. అలాంటి వాహనాలను పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయాలని పేర్కొంది. వాహనం యాజమాన్య బదిలీకి కూడా ఆటంకాలు ఏర్పడనున్నాయి.