ఆగ్రా, 22 సెప్టెంబర్ 2022
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఫతేహాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే చిన్నేలాల్ వర్మ (73) గురువారం రాత్రి నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బీజేపీ ఎమ్మెల్యే చిన్నేలాల్ వర్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆగ్రాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మెరుగైన వైద్యం కోసం నోయిడాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.











