ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు కాక్రాచ్ జనతా పార్టీ ప్రకటించింది. ఈ నిరసనకు లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో జవాబుదారీతనం, సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సమయంలో కాక్రాచ్ జనతా పార్టీకి తాను పూర్తి మద్దతు ఇచ్చానని వాంగ్‌చుక్ తెలిపారు. అప్పట్లో ఆ ఉద్యమం బలహీనంగా ఉండేదని, ఇప్పుడు దానికి బలమైన స్వరం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో మార్పు కోసం చేపట్టే ఉద్యమాలు స్వతంత్రంగా ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుత నిరసనలో తాను వ్యక్తిగతంగా పాల్గొనే అవకాశం లేదని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. అయితే దేశంలో జవాబుదారీతనాన్ని పెంచడం, ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడం కోసం జరిగే ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి కావడంతో ఆ రోజు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన పేర్కొన్నారు.











