ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సవరణపై అభ్యంతరాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసన నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక వివరణ ఇచ్చింది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో సుమారు 240 మంది ఎంపీలతో సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదనను తమ నిబంధనల ప్రకారం అంగీకరించలేకపోయామని ఈసీ స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం ప్రకారం.. న సాయంత్రం 4 గంటల వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అధికారిక ప్రతినిధి ద్వారా తమతో సమావేశానికి ముందస్తు అపాయింట్మెంట్ కోరలేదు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల ద్వారా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల బృందం ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం సమర్పించాలనుకుంటున్న విషయం తమకు తెలిసిందని పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2025లో రాజకీయ పార్టీలతో సమావేశాల కోసం ఎన్నికల సంఘం ఒక విధానాన్ని రూపొందించిందని కమిషన్ తెలిపింది. ఆ విధానం ప్రకారం, రాజకీయ పార్టీ లేదా పలు పార్టీల సంయుక్త ప్రతినిధి బృందం తమ అధీకృత ప్రతినిధి ద్వారా ముందుగా సమావేశానికి అనుమతి తీసుకోవాలి. ఇరుపక్షాలకు అనుకూలమైన సమయాన్ని నిర్ణయించిన తర్వాత సమావేశం ఈసీ కార్యాలయ ప్రాంగణంలో జరగాల్సి ఉంటుందని వివరించింది.











