కడప, 11 September
రాజంపేట పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కొరతను తక్షణమే పరిష్కరించి, పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ దగ్గుపాటి నవీన్ కుమార్, శుక్రవారం సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన ఐఏఎస్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజంపేట పట్టణ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి సబ్ కలెక్టర్ భావనకు వినతిపత్రం: డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ డాక్షిన్ టైమ్స్ . జిల్లా రాజంపేట పట్టణంలో నెలకొన్న ప్రధాన ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కొరతను తక్షణమే పరిష్కరించి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ దగ్గుపాటి నవీన్ కుమార్ శుక్రవారం సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన ఐఏఎస్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోనే కీలక వాణిజ్య కేంద్రంగా విస్తరిస్తున్న రాజంపేట పట్టణంలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవడం, డ్రైనేజీ సమస్యలు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్ వల్ల ప్రజల దైనందిన జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రంలో ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు: 1.భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ (UGD): పట్టణానికి శాశ్వత పరిష్కారంగా సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. 2.వర్షపు నీటి కాలువలు: వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తకుండా స్ట్రామ్ వాటర్ డ్రైన్లను పూర్తిస్థాయిలో పరిశీలించి, పూడికతీత పనులు చేపట్టి అవసరమైన చోట కొత్త కాలువలు నిర్మించాలి. 3.రహదారులు – గుంతల మరమ్మతులు: సుద్దగుంటల, సాతపల్లి మెయిన్ రోడ్డు, శివాజీనగర్, రెడ్డివారి వీధితో పాటు పలు వార్డుల్లో అధ్వానంగా మారిన రోడ్లను బాగు చేసి సీసీ రోడ్లు నిర్మించాలి. 4.ట్రాఫిక్ నియంత్రణ & రోడ్ల విస్తరణ: ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నందున రోడ్ల విస్తరణ చేపట్టాలని, అక్రమ ఆక్రమణలు, పార్కింగ్ సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 5.రక్షిత తాగునీటి సరఫరా: పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, పైప్‌లైన్ లీకేజీలు సరిచేసి కలుషిత నీటి సమస్య తలెత్తకుండా పర్యవేక్షించాలి. 6.పారిశుధ్యం – మార్కెట్ ఆధునీకరణ: కూరగాయల మార్కెట్ పరిసరాల్లో చెత్తను క్రమం తప్పకుండా తరలించాలని, మార్కెట్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆధునీకరించాలని, పెద్ద మసీదు పరిసరాల్లో మురుగు నీరు నిలవకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 7.ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నియామకం: సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి. 8.మాస్టర్ ప్లాన్ & బైపాస్ రోడ్డు: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించడంతో పాటు, పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడానికి బైపాస్/రింగ్ రోడ్డు నిర్మాణ సాధ్యాసాధ్యాలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని, ఆధునిక ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భవన ను డాక్టర్ నవీన్ కుమార్ తో పాటు లక్ష్మీనారాయణ, అనసూయమ్మ తెలుగుదేశం పార్టీ తదితర నేతలు పాల్గొన్నారు











