విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ2025 స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల నియామకాల అంశం ఉద్రిక్తతకు దారితీసింది. తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులపై దాడి జరిగిందని ప్రభుత్వం ఆరోపించగా, తమ కార్యకర్తలపైనే దాడి జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు అండగా ఉంటామని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
స్పోర్ట్స్ కోటా ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులు తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ శాప్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని నిరసనకు దిగడంతో ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటనలో కొంతమంది ఉపాధ్యాయులపై దాడి జరిగినట్లు ప్రభుత్వం, అధికార పార్టీ వర్గాలు ఆరోపించాయి. మరోవైపు తమ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈ పరిణామాలపై పోలీసులు కేసులు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి బాధ్యులను గుర్తించే చర్యలు చేపట్టారు.











