తిరువూరులోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయ కళ్యాణ మహోత్సవంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో అలజడి రేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో, ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ కేశినేని చిన్నికి ఆలయ అధికారులు పట్టువస్త్రాలు అందించారు. ఈ సమయంలో, స్థానిక ఎమ్మెల్యేగా తనను విస్మరించారని భావించిన కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ చేతుల్లో ఉన్న పట్టువస్త్రాలను లాక్కొని, తన నెత్తిపై పెట్టుకుని స్వామివారికి సమర్పించారు. ఈ చర్య అక్కడున్న భక్తులను, అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సంఘటనతో ఎంపీ కేశినేని చిన్ని దంపతులు నిరాశ చెంది, సాధారణ భక్తులతో కలిసి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ అనూహ్య పరిణామం ఇరువర్గాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది.









