పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గంలో రాజకీయంగా తీవ్ర కలకలం రేకెత్తించే సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆదేశాల మేరకు, తమ పార్టీకి చెందిన టీడీపీ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వర రాజు నివాసం, కార్యాలయం అర్ధరాత్రి వేళ కూల్చివేయబడ్డాయి.
అర్థరాత్రి సమయంలో భారీ యంత్రాలతో ఈ కూల్చివేతలు జరగడం స్థానికంగా భయాందోళనలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి, ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కూల్చివేతలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ, రాజకీయ కక్ష సాధింపు చర్యగా దీనిని అభివర్ణిస్తున్నారు. దీని వెనుక గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










