దివంగత మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కాకా గడ్డం వెంకటస్వామి రాజకీయ జీవితాన్ని ఉసిరి ఆకులపై రాసి ఓ యువ కళాకారుడు వినూత్నంగా నివాళులర్పించాడు. కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కళాకృతిని ఆవిష్కరించారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం పెద్దబండ గ్రామానికి చెందిన యువ కళాకారుడు దుర్గం వినయ్ కుమార్ ఉసిరి ఆకులపై కాకా వెంకటస్వామి రాజకీయ ప్రస్థానాన్ని అక్షరాలుగా మలిచారు. అనంతరం ఆ కళాకృతిని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు బహూకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు ఈ కళాకారుడి ప్రతిభను అభినందించినట్లు కథనం పేర్కొంది.











