వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రొద్దుటూరులో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన నూతన వధూవరులు కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైఎస్ జగన్ రాక సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హెలీప్యాడ్ వద్ద, కళ్యాణ మండపం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. అభిమానులు దారి పొడవునా పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.









