భారత మహిళా క్రికెట్లో యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-100లోకి ప్రవేశించింది. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ 20 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్ ఏకంగా 53 స్థానాలు ఎగబాకి బౌలర్ల జాబితాలో 94వ ర్యాంకును దక్కించుకుంది.
జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయాల్లో వైష్ణవి శర్మ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా చివరి రెండు వన్డేల్లో ఆమె బౌలింగ్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేసింది. రెండో వన్డేలో నాలుగు వికెట్లు పడగొట్టిన వైష్ణవి, మూడో వన్డేలో మరింత చెలరేగింది. కేవలం 39 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసింది. వన్డే క్రికెట్లో ఆమెకు ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. ఈ అద్భుత ప్రదర్శనకు గాను చివరి వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడిన వైష్ణవి, రెండు మ్యాచ్‌ల్లోనే తొమ్మిది వికెట్లు సాధించడం విశేషం. జింబాబ్వేపై ఆమె చూపిన ప్రతిభకు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ పురోగతి లభించింది. తాజా ర్యాంకింగ్స్‌లో వైష్ణవితో పాటు మరికొందరు భారత బౌలర్లు కూడా మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. సయాలి సత్ఘరే 18 స్థానాలు ఎగబాకి 85వ ర్యాంకుకు చేరుకుంది. చివరి వన్డేలో 11 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గౌడ్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 24వ ర్యాంకుకు చేరుకుంది.












