భారత్‌లో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్స్ క్రికెట్ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ 50 ఏళ్లు పైబడిన క్రికెట్ జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతి నిరాకరించింది. దీంతో గత ఏడాది ప్రపంచకప్ విజేత అయిన పాకిస్థాన్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో జరిగే టోర్నీకి దూరమైంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ (పీవీసీఏ) అధ్యక్షుడు ఫవాద్ ఇజాజ్ వెల్లడించారు.
భారత్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెటరన్స్ జట్టుకు వీసాలు మంజూరు చేయడంతో పాటు అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తామని నిర్వాహకులు, ఆతిథ్య దేశ ప్రతినిధులు హామీ ఇచ్చారని ఫవాద్ ఇజాజ్ తెలిపారు. ఈ హామీల నేపథ్యంలో తమ జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆ దేశ విదేశాంగ, హోంశాఖలను పీవీసీఏ సంప్రదించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, భారత్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వలేమని పీసీబీ స్పష్టం చేసిందని ఫవాద్ వెల్లడించారు. పాకిస్థాన్ హోంమంత్రి, పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్ని తమకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దీంతో టోర్నీలో పాల్గొనాలన్న పాకిస్థాన్ వెటరన్స్ జట్టు ప్రయత్నాలకు బ్రేక్ పడింది.












