పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న మూడు దేశాల వన్డే క్రికెట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రావల్పిండిలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 87 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. యువ ఆల్‌రౌండర్ అఫ్రాత్ మిన్హాస్ బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్న అఫ్రాత్ మిన్హాస్, ఆ తర్వాత బంతితోనూ ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్ను విరిచాడు. అతడు ఆరు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును అఫ్రాత్ మిన్హాస్, హసన్ నవాజ్ ఆదుకున్నారు. హసన్ నవాజ్ 79 పరుగులతో రాణించగా, అఫ్రాత్ మిన్హాస్ 58 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఫహీమ్ అష్రఫ్ 26 బంతుల్లో 39 పరుగులు సాధించడంతో పాకిస్థాన్ పోరాడదగిన స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్ సోనీ బేకర్ మూడు వికెట్లు తీశాడు.












